ప్రజల భద్రత దృష్ట్యా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో.. నేడు సాయంత్రం 7గంటల నుంచి పెట్రోలింగ్ నిర్వహించనున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ప్రమోద్ పేర్కొన్నారు. ఊరేగింపులు, ర్యాలీలు, బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా గుమిగూడడం, వాహనాలపై తిరగడం వంటి చర్యలకు పాల్పడితే.. చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
'బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడితే కఠినచర్యలే'
వరంగల్ కమిషనరేట్ పరిధిలో నూతన సంవత్సర వేడుకల నిర్వహణకు అనుమతించబోమని నగర పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు వేడుకలను తమ ఇళ్ళల్లోనే జరుపుకోవాలని సూచించారు.
'బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడితే కఠినచర్యలే'
మద్యం సేవించి వాహనాలను నడిపేవారి కట్టడి కోసం మొబైల్ పోలీస్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీస్ విభాగాలతో కలసి 100కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు.
ఇదీ చదవండి:న్యూ ఇయర్ గిఫ్ట్: బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి