కరోనా సమయంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు తీసుకున్న చర్యలకు గుర్తింపు లభించింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బెస్ట్ పోలీసింగ్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ కేటగిరిలో పోలీసులకు చోటు దక్కింది. దీనికి సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధుల చేతుల మీదుగా... వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి త్వరలో అందుకోనున్నారు.
ఆ విషయంలో.. పోలీసులకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు - వరంగల్ జిల్లా తాజా వార్తలు
ప్రతిష్ఠాత్మకమైన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వరంగల్ కమిషనరేట్ పోలీసులు చోటు దక్కించుకున్నారు. కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకున్నందుకు గానూ వరంగల్ కమిషనరేట్‌ను ఎంపిక చేసింది.
కరోనా కట్టడిలో వరంగల్ పోలీసుల కృషికి అంతర్జాతీయ గుర్తింపు
కరోనా కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలను అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకున్నందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎంపిక చేశారు. ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ నుంచి వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి సమాచారం అందింది.
ఇదీ చదవండి: తీవ్ర ఇన్ఫెక్షన్కూ భారతీయ టీకాలు చెక్!