వరంగల్ అర్బన్ జిల్లాలో సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరిగే ఐనవోలు జాతర ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ రవీందర్ పరిశీలించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా 400 మంది పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.
ఐనవోలు జాతరకు రంగం సిద్ధం - ఐనవోలు జాతర ఏర్పాట్లు పరిశీలించిన సీపీ
వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు మండలకేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయాన్ని వరంగల్ సీపీ రవీందర్ సందర్శించారు. సంక్రాంతికి ప్రారంభం కానున్న ఐనవోలు జాతర ఏర్పాట్లను పరిశీలించారు.
ఐనవోలు జాతరకు రంగం సిద్ధం
ఆలయ చుట్టుపక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని సీపీ తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో దైవ దర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.