తెలంగాణ

telangana

ETV Bharat / state

'అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవు' - telangana news

కమిషనరేట్ పరిధిలో అనధికారికంగా ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి హెచ్చరించారు. ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయాలంటే నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

Warangal Commissioner Pamela Satpathy
వరంగల్ కమిషనర్ పమేలా సత్పతి

By

Published : Dec 26, 2020, 11:26 AM IST

వరంగల్ కమిషనరేట్ పరిధిలో అనధికారికంగా ఫ్లెక్సీలు, గోడ పత్రికలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ పమేలా సత్పతి హెచ్చరించారు. ప్రధాన కూడళ్లలోని గోడలపై ప్రకటనలకు సంబంధించిన పత్రికలను అతికించరాదని స్పష్టం చేశారు.

ప్రకటన బోర్డులను ఏర్పాటు చేయాలంటే నగరపాలక సంస్థ అనుమతులు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించిన వారిపై మున్సిపల్ నూతన చట్టం 161(3 ) ప్రకారం కఠిన చర్యలు తప్పవని అన్నారు.

ఇదీ చదవండి:వికారాబాద్ జిల్లాలో ఘోరప్రమాదం.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details