వరంగల్ జిల్లా సహకార బ్యాంకు.. లాభాల బాటలో దూసుకెళ్తోందని ఆ బ్యాంకు ఛైర్మన్ రవీందర్ పేర్కొన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు మహజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు.
'వరంగల్ సహకార బ్యాంకు.. లాభాల బాటలో దూసుకెళ్తోంది'
సమష్టి కృషితో బ్యాంకును.. రూ.800 కోట్ల నుంచి 1200 కోట్ల టర్నోవర్‌కు తీసుకొచ్చామని వరంగల్ జిల్లా సహకార బ్యాంకు ఛైర్మన్ రవీందర్ పేర్కొన్నారు. హన్మకొండలోని అంబేడ్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన డీసీసీబీ బ్యాంకు మహజన సభ సమావేశంలో ఆయన మాట్లాడారు.
వరంగల్ సహకార బ్యాంకు
సమష్టి కృషితో రూ. 800 కోట్ల నుంచి 1200 కోట్ల టర్నోవర్‌కు తీసుకువచ్చామన్నారు రవీందర్. రూ. 4 కోట్ల లాభాల్లో ఉన్న బ్యాంకు.. ఏడాది కాలంలో దాదాపు రూ. 8 కోట్లకు చేరిందని వివరించారు. రైతులకు రూ. 100 కోట్ల పంట రుణాలను అందించామని గుర్తు చేశారు. దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఇంటర్నెట్, మొబైల్ ద్వారా మరిన్ని సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
ఇదీ జరిగింది:ఓ మహిళా మేలుకో... ఉన్నంతలో కొంత దాచుకో...!