మర్కజ్ ప్రార్థనల ప్రభావం వరంగల్ నగరంపై పడింది. దిల్లీకి వెళ్లి వచ్చిన వారికి పాజిటివ్ రిపోర్ట్ రావడం వల్ల జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. కాలనీల్లోకి వెళ్లే మార్గాలను ఎక్కడికక్కడే మూసివేశారు. నిజాంపూర్ మంచి బజార్ ఎల్బీనగర్కు వెళ్లే రహదారులను పోలీసులు నిర్బంధించి పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.
వరంగల్‌లో అప్రమత్తం... ఎక్కడికక్కడ సడక్ బంద్ - WARANGAL CITY ALERT BY CORONA AFFECTED PERSONS
వరంగల్ మహా నగరంపై మర్కజ్ ప్రార్థనల ప్రభావం కనిపిస్తోంది. ఇటీవలే దిల్లీకి వెళ్లొచ్చిన వారిలో కరోనా పాజిటివ్ నిర్థరణ అయ్యింది. ఫలితంగా నగరంలో ఎక్కడికక్కడ దారులను పోలీసులు మూసేశారు.
వరంగల్ నగరంలో కాలనీ దారుల మూసివేత
బస్తీ నుంచి ఎవరు ఇళ్లు వదిలి బయటకి రాకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని వాహనాలను దారి మళ్లించారు. కాలనీలోకి ఎవరు ప్రవేశించకూడదని పోలీసులు నిషేధం విధించారు. లాక్ డౌన్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.