వరంగల్ భధ్రకాళీ అమ్మవారి ఆలయం చెంతనే... భద్రకాళీ బండ్ సర్వాంగ సుందరంగా తయారైంది. ఐటీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్, రేపు.. భద్రకాళీ బండ్‌ను ప్రారంభించనున్నారు. మంత్రి రాకను పురస్కరించుకుని చేయాల్సిన ఏర్పాట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయకరరావు పరిశీలించారు. ఇంకా మిగిలి ఉన్న కొద్ది పాటి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ చరిత్రలో బండ్ నిలిచిపోతుందని.. పరిసర ప్రాంతాల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు. నగరవాసులకు ఆహ్లాదం కలిగించేలా 30 ఎకరాల్లో శిల్పారామం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
వరంగల్ భద్రకాళీ బండ్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి - మంత్రి కేటీర్
రేపు వరంగల్ భద్రకాళీ బండ్‌ను ప్రారంభించేందుకు మంత్రి కేటీర్ వెళ్తున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసేందురు మంత్రి ఎర్రబెల్లి.. బండ్‌ను పరశీలించారు.
వరంగల్ భద్రకాళీ బండ్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
ఇవీ చూడండి: చర్చలు విఫలం... సమ్మె యథాతథం