తెలంగాణ

telangana

ETV Bharat / state

రక్తదానం ప్రాణాన్ని నిలబెడుతుంది: అడిషనల్​ డీసీపీ పుష్ప - etv bharath

మనం చేసే రక్తదానం మరో వ్యక్తి ప్రాణాన్ని నిలబెడుతుందని వరంగల్​ అడిషనల్​ డీసీపీ పుష్ప అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ముద్ర అగ్రికల్చర్ స్కిల్స్ డెవలప్​మెంట్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రెడ్​క్రాస్.. ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

రక్తదానం ప్రాణాన్ని నిలబెడుతుంది: అడిషనల్​ డీసీపీ పుష్ప
రక్తదానం ప్రాణాన్ని నిలబెడుతుంది: అడిషనల్​ డీసీపీ పుష్ప

By

Published : Sep 17, 2020, 5:32 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ముద్ర అగ్రికల్చర్ స్కిల్స్ డెవలప్​మెంట్ ఆధ్వర్యంలో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రెడ్​క్రాస్.. రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఈ రక్తదాన శిబిరాన్ని వరంగల్ అడిషనల్ డీసీపీ పుష్ప ప్రారంభించారు. 150 మంది ముందుకు వచ్చి రక్త దానం చేశారు.

మనం చేసే రక్తదానం మరో వ్యక్తి ప్రాణాన్ని నిలబెడుతుందని డీసీపీ అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం అవసరమన్నారు. రక్త దానం చేసేందుకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. రక్త దాన శిబిరాలు నిర్వహించే వారిని ప్రోత్సహించాలన్నారు.

ఇదీ చదవండి:ఎన్నిరోజులైనా లక్ష ఇళ్లను పరిశీలిస్తాం: భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details