తెలంగాణ

telangana

ETV Bharat / state

గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: ఆరూరి రమేశ్ - గ్రేటర్ ఎన్నికలపై కీలక సమావేశం నిర్వహించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే

రాబోయే గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పార్టీ నాయకులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. హన్మకొండలోని నియోజకవర్గ పరిధి మండల ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్​కు రానున్నారని ఆయన తెలిపారు.

waranagal urban dist vardhannpet MLA aruri ramesh
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ కార్యకర్తలతో సమావేశం

By

Published : Apr 9, 2021, 7:06 PM IST

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ఈ నెల 12న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్​కు రానున్నారని ఆయన తెలిపారు. హన్మకొండలో నియోజకవర్గం పరిధిలోని హసన్​పర్తి , ఐనవోలు, పర్వతగిరి మండలాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు.

రాబోయే ఎన్నికలలో తెరాస పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పుష్కరఘాట్​ వద్ద రక్షణ చర్యలు చేపట్టిన సర్పంచ్

ABOUT THE AUTHOR

...view details