అనుమానాస్పద స్థితిలో మహిళ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్‌లోని విష్ణుపురిలో చోటుచేసుకుంది. ఆత్మహత్యకు అత్తింటి వారి వేధింపులే కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విష్ణుపురికి చెందిన నాగుల శివప్రసాద్, హర్షిత దంపతులకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అదనపు కట్నం కోసం భర్త, అతని కుటుంబ సభ్యులు హర్షితను 6నెలలుగా వేధిస్తున్నారని మృతురాలి సోదరుడు తెలిపాడు. సంవత్సరం క్రితం కుమారుడు పుట్టి మరణించాడని.. అప్పటినుంచి వేధింపులు మరింత తీవ్రమయ్యాయని వారు తెలిపారు. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో భర్తపై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసినట్లు కాజీపేట్ పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య - death
వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట్‌లో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందింది. అత్తింటివారి వేధింపులే కారణమని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య