Viral Fevers Spreading in Warangal : జ్వరం వణికిస్తోంది..! ఏ ఇంట్లో చూసిన ఇదే మాట. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ అందరినీ కలవరపెడుతోంది. వాతావరణ మార్పులు, ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొస్తున్న దోమల కారణంగా.. గత కొద్ది రోజులుగా జ్వరాల(Fevers) బాధితులు విపరీతంగా పెరిగిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఎంజీఎం దవాఖానా(MGM Govt Hospital) వార్డులు వృద్ధులు, మహిళలు, పిల్లలతో నిండిపోయాయి.
Dengue Cases Increase in Warangal : కొద్ది రోజులుగా డెంగీ కేసులు(Dengue Cases) విపరీతంగా పెరగడంతో.. ఆందోళన కలిగిస్తోంది. ఎంజీఎం ఆసుపత్రిలో గత నెలలో 134 డెంగీ కేసులు నమోదైతే... ఈ నెలలో ఇప్పటివరకూ 155 కేసులు నమోదైయ్యాయని వైద్యులు చెబుతున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. అదనంగా మరో వైద్యుడిని ఓపీలో అందుబాటులో ఉంచామని ఎంజేఎం సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు.
"నెలరోజుల నుంచి వచ్చిన కేసులు ఒకెత్తు. సెప్టెంబరు 17 నుంచి వచ్చిన కేసులు మరోకొత్తు. అప్పటికీ ఇప్పటికీ కేసులు డబుల్, ట్రపుల్ అయ్యాయి. నెలలో 30 నుంచి 40 మంది ఇన్‌పేషెంట్‌లు ఉండేవారు. ఈనెల 17 నుంచి 100కు పైన ఇన్‌పేషెంట్‌లు ఉన్నారు. ఇన్‌పేషెంట్‌లలో డెంగీ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈరోజుకి 22 మంది ఇన్ పేషెంట్‌లు ఉన్నారు. తర్వాత ఇద్దరు మలేరియా పేషెంట్‌లు ఉన్నారు. ఫీవర్స్‌తోటి 100 మంది ఆస్పత్రిలో ఉన్నారు."- చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్
Peoples Face Problems Dengue Fever in Warangal : డెంగీ, మలేరియా సాధారణ వ్యాధులైనప్పటికీ.. పరిస్థితి విషమించక ముందే డాక్టర్లను సంప్రదించాలని చంద్రశేఖర్ చెబుతున్నారు. ఎంజీఎంలో.. బాధితులకు సరిపడా పడకలు, డెంగీ కిట్లు అందుబాటులో ఉంచామన్నారు. రక్తం, ప్లేట్ లెట్ల సరఫరాలో కొరత లేదని తెలిపారు. మరో పది నుంచి పదిహేను రోజులు ఇదే తీవ్రత ఉంటుందని.. ఆ తరువాత జ్వరాలు తగ్గుముఖం పట్టవచ్చని వైద్యులు చెపుతున్నారు. దోమల వ్యాప్తి లేకుండా.. ఇంటి పరిసరాలు పరిశ్రుభంగా ఉంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.