వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి - భక్తుల మీద దూసుకుపోయిన ఎడ్లబండ్లు
శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామి దర్శననానికి భక్తులు ఎడ్లబండ్లలో రాగా బండ్లు అదుపుతప్పి భక్తుల మీదకి దూసుకుపోయాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి
వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని శ్రీ కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్లబండ్లు తిరుగుతున్న సమయంలో బండ్లు అదుపుతప్పి భక్తుల మీదకి దూసుకుపోయాయి. దీంతో పలువురు భక్తులకు గాయాలయ్యాయి.