కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్ర సర్కార్ విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. కానీ.. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ విద్యార్థులు పరీక్షను అడ్డుకుని పరీక్షా పత్రాలను చింపివేశారు. ఈ క్రమంలో ఏబీవీపీ విద్యార్థికి చేతికి గాయం కావడం వల్ల ఏబీవీపీ నాయకులకు, కళాశాల యాజమాన్యానికి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
హన్మకొండలో కరోనా నిబంధనలు గాలికొదిలి సెమిస్టర్ పరీక్ష.. - Violation of corona rules at Hanamkonda
ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. మరోవైపు సర్కార్ ఆదేశాలను.. కరోనా నిబంధనలను గాలికొదిలేస్తూ.. హన్మకొండలోని ఓ డిగ్రీ కళాశాలలో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నేతలు పరీక్షను అడ్డుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులను కళాశాల నుంచి బయటకు పంపించారు. ప్రభుత్వ ఆదేశాలను, కరోనా నిబంధనలు గాలికి వదిలి.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారని కళాశాల యాజమాన్యాన్ని ఏబీవీపీ నేతలు ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కళాశాల యాజమాన్యం మాత్రం.. టాస్క్ రిజిస్ట్రేషన్ కోసమే విద్యార్థులను పిలిచామని.. ఈలోగా ఏబీవీపీ వాళ్లు వచ్చి అడ్డుకున్నారని చెబుతున్నారు.
- ఇదీ చదవండి :తెలంగాణపై కరోనా పంజా.. అప్రమత్తమైన ఆరోగ్య శాఖ