కరోనా నియంత్రణలో తెలంగాణ దేశానికే దిక్సూచిలా మారిందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. పేదలు, వలస కార్మికులను ఆదుకునేందుకు మరో నెల ఉచిత బియ్యం, నగదును అందిస్తామని తెలిపారు.
కోటి మాస్కుల పంపిణీలో పాల్గొన్న వినోద్ కుమార్ - Made of crores of masks Pratima Foundation
కరోనా వ్యాప్తి నియంత్రణను అరికట్టేందుకు సర్కారు ముందుచూపుతో చర్యలు చేపడుతోందని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు.
కోటి మాస్కుల పంపిణీలో పాల్గొన్న వినోద్ కుమార్
ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా వ్యాప్తంగా కోటి మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైరస్ వ్యాప్తి కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు సహకరిస్తున్నారని అన్నారు. పట్టణాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన కొనియాడారు.
ఇదీ చూడండి :మాస్క్‌లు లేవు... ఆరోగ్య పరీక్షలు కానరావు