Warangal City Variety Ganesh: వినాయక చవితి ఈ పండక పేరు చేబితెనే భారతీయుల్లో చెప్పలేని ఉత్సహాం. కారణం భారతీయ పండుగల్లో ముందుగా వచ్చే పండుగ వినాయక చవితి. ఏపని మెుదలు పెట్టిన మెుదట వినాయకుని పూజిస్తే ఆ పని విజయవంతం అవుతుందని నమ్మకం. అలా భక్తులు వివిధ రూపాల్లో, వివిధ ఆకృతిలో వినాయకుని పూజించండం ఆనవాయితీగా వస్తోంది.
"భళా మోదీ భళా" ప్రత్యేక ఆకర్షణలో వినాయకుని విగ్రహం - గణేశుని ఎత్తుకున్న మోదీ విగ్రహం
Warangal City Variety Ganesh: రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. యువకులు,పెద్దలు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా అందరూ కలిసి గణనాధుడుని వివిధ రూపాల్లో వివిధ ఆకృతిలో తయారుచేసి పూజిస్తున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్ స్టైల్లో విగ్రహాలు తయారుచేసి తమ అభిమాన నటుల్ని వినాయకుని రూపంలో కొందరు కొలుచుకుంటే, హనుమకొండలో మోదీ, వినాయకుని భుజంపై తీసుకెళ్తున్నట్లు తయారు చేసిన విగ్రహం ఇప్పడు ప్రత్యేక ఆకార్షణగా కనిపిస్తోంది.
Vinayaka Chavithi celebrations
ఇప్పటికే పుష్ప, ఆర్ఆర్ఆర్,గబ్బర్‌సింగ్, కిక్రెట్ ఆటగాళ్లు రూపంలో మనం విగ్రహాలు కొలువు తీరడం చూశాం. ఇప్పడు తాజా వరంగల్ జిల్లా హనుమకొండలోని గుడి బండల్ ప్రాంతంలో ప్రధాని మోదీ వినాయకుడిని తన భూజాలపై మోస్తున్నట్లు ఉన్న విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీనిని స్థానిక యువకులు ప్రతిష్ఠించి ప్రత్యేక పూజాలు చేయగా భాజపా అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అనేక మంది మహిళలు పాల్గొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
ఇవీ చదవండి: