హనుమకొండ వడ్డేపల్లిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. మొత్తం 69 మంది లబ్ధిదారులకు లక్షా అరవై ఐదు వేల రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన వినయ్ - Chief Whip Dasan Vinay, Chief Minister's Aid Checks at Vaddepalli
ఒక వైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వడ్డేపల్లిలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన వినయ్
నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి శిక్షణ ఇచ్చి, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కార్యక్రమాలు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. దీనికోసం కేటీఆర్ గారి సహకారంతో సెట్విన్ కంపెనీని నగరానికి తీసుకు వస్తున్నట్లు పేర్కొన్నారు. కాజీపేట్ రైల్వే వ్యాగన్ షెడ్, పిరియాడికల్ పరిశ్రమ ఏర్పాటు కోసం నిధులను త్వరిత గతిన విడుదల చేయాలని త్వరలో ముఖ్యమంత్రిని కలవనున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి : ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ
TAGGED:
govt chief whip