తెలంగాణ

telangana

ETV Bharat / state

చౌకబారు విమర్శలు మానుకోండి: వినయ్​ భాస్కర్​ - వరంగల్​ జిల్లా

చౌకబారు విమర్శలు మానుకోవాలని విపక్షాలకు ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​ భాస్కర్​ హితవు పలికారు. కర్ణాటక తరహా ప్రయోగాలు తెలంగాణలో చెల్లవని భాజపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు.

చౌకబారు విమర్శలు మానుకోండి: వినయ్​ భాస్కర్​

By

Published : Sep 14, 2019, 10:46 PM IST

సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తోన్న తెరాసపై చౌకబారు విమర్శలు మాని... ప్రజాక్షేత్రంలో ఉండి బలం పెంచుకోవాలని విపక్షాలకు ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ సూచించారు. వరంగల్​ జిల్లా హన్మకొండలో మీట్ ది ప్రెస్​లో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటక తరహా ప్రయోగాలు ఇక్కడ చెల్లవని భాజాపా నేతలు గుర్తుంచుకోవాలన్నారు. కుట్రలు కుతంత్రాలకు ఇకనైనా స్వస్థి పలకాలని హితవు పలికారు. రాష్ట్రానికి నెలకొక కేంద్రమంత్రి వస్తారంటే... భయపడే వారెవరూ లేరన్నది భాజాపా నాయకులు తెలుకోవాలని వినయ్​ భాస్కర్​ పేర్కొన్నారు.

చౌకబారు విమర్శలు మానుకోండి: వినయ్​ భాస్కర్​

ABOUT THE AUTHOR

...view details