కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు - కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు
వెలివాడలన్నీ తొలివాడలు కావాలనే ఆశయంతో గ్రామ గ్రామాన బహుజన బతుకమ్మ సంబురాలను నిర్వహిస్తున్నామని అరుణోదయ సాంస్కృతిక మండలి ఛైర్మన్ విమలక్క అన్నారు.
![కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4644079-290-4644079-1570157311410.jpg)
కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు
వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ రైల్వే స్టేషన్ ముందు రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరుణోదయ సాంస్కృతిక మండలి ఛైర్మన్ విమలక్క హాజరయ్యారు. రైల్వే మహిళా ఉద్యోగులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. రైతులు క్షేమంగా ఉంటేనే పంటలు పండుతాయని.. బతుకమ్మకు బతుకునిచ్చే జీవవైవిధ్యాన్ని మనమందరం కాపాడుకోవాలని విమలక్క సూచించారు.
కాజీపేట రైల్వేస్టేషన్ ముందు బతుకమ్మ సంబురాలు
TAGGED:
VIMALAKKA