Villagers of Dubbapally are suffering from KTPP waste: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారు దుబ్బపల్లి గ్రామమిది. 400 కుటుంబాలు ఉండే ఈ ఊరిలో ఏ ఒక్కరిలోనూ సంతోషం మచ్చుకైనా కనిపించదు. అందుకు కారణం పంట పొలాలు బీడు బారడమే. కాకతీయ ధర్మల్ పవర్ ప్లాంట్-కేటీపీపీ నుంచి వచ్చే రసాయనాల తాలూకు వ్యర్ధాలను మోరంచ వాగులోకి వదులుతున్నారు. ఫలితంగా వాగు నీటితో సాగయ్యే పంటపొలాలు మోడుబారిపోతున్నాయి.
వ్యర్థజలాలు తాగి పశువులు మృతి: గతంలో ఈ వ్యర్ధజలాలను కొంపెల్ల చెరువులోకి వదలగా.. చేపపిల్లలు చనిపోతున్నాయంటూ మత్స్యకారులు అభ్యంతరం చెప్పడంతో.. ఆ నీటిని మోరంచ వాగువైపునకు మళ్లిస్తున్నారు. ఫలితంగా తమ పంటలు సరిగ్గా పండట్లేదని దుబ్బపల్లి గ్రామ రైతులు వాపోతున్నారు. తాము రోగాల బారినపడుతున్నారని.. పశువులు చనిపోతున్నాయని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాన్ని, పొలాలను తామే తీసుకుంటామని జెన్‌కో.. పదేళ్ల క్రితమే చెప్పినా.. రెవెన్యూ శాఖ తీరుతో అది ఆచరణలోకి రావట్లేదు.