విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో విద్యుత్ అధికారులు అవగాహన ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని విద్యుత్ భవన్ నుంచి కాళోజీ కూడలి వరకు జరిగిన ర్యాలీని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అజాగ్రత్తతో రోజురోజుకు విద్యుత్ వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాన కల్పించడానికి ఈ అవగాహన ర్యాలీ చేపట్టామని వెల్లడించారు.
ఓరుగల్లులో విద్యుత్ అధికారుల అవగాహన ర్యాలీ - vidhyuth badratha varothsavalu
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు జెండా ఊపి ప్రారంభించారు.
![ఓరుగల్లులో విద్యుత్ అధికారుల అవగాహన ర్యాలీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3193357-thumbnail-3x2-rallyjpg.jpg)
ఓరుగల్లులో విద్యుత్ అధికారుల అవగాహన ర్యాలీ