వరంగల్ మహా నగర పాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఆకలిని విక్టరీ వెంకటేశ్, రానా అభిమానుల సంఘం తీర్చింది. గ్రేటర్ పరిధిలోని 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆహారాన్ని సంఘ సభ్యులు అందజేశారు.
పారిశుద్ధ్య కార్మికుల ఆకలి తీర్చిన 'విక్టరీ' వెంకటేశ్ ఫ్యాన్స్ - వరంగల్ పారిశుద్ధ్య కార్మికులు విక్టరీ వెంకటేశ్ అభిమానుల సంఘం
లాక్డౌన్ వేళలోనూ నిరంతరం శ్రమిస్తున్న వరంగల్లోని పారిశుద్ధ్య కార్మికులకు విక్టరీ వెంకటేశ్, రానా అభిమానుల సంఘం అండగా నిలిచింది. కార్పొరేషన్ పరిధిలోని 500 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఆహారాన్ని పంపిణీ చేసి వారి ఆకలిని తీర్చింది.
![పారిశుద్ధ్య కార్మికుల ఆకలి తీర్చిన 'విక్టరీ' వెంకటేశ్ ఫ్యాన్స్ 'విక్టరీ' ఫ్యాన్స్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7144445-1081-7144445-1589122510250.jpg)
'విక్టరీ' ఫ్యాన్స్
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సేవలు మరువలేనివని వారు తెలిపారు. కార్మికులకు వెంకటేశ్, రానా అభిమానుల సంఘం అండగా ఉంటుందని సభ్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి:ఆ ఒక్క రాష్ట్రంలోనే లక్ష లాక్డౌన్ ఉల్లంఘన కేసులు!