వరంగల్ నగరంలోని ఏవీవీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకల ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్‌కి చేరుకున్న తర్వాత రోడ్డు మార్గంలో సభాస్థలికి వస్తారని నిర్వాహకులు తెలిపారు.
వరంగల్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలు.. హాజరవనున్న వెంకయ్య నాయుడు - వరంగల్ ఏవీవీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలు
వరంగల్‌లో జరిగే ఏవీవీ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవనున్నారు. ఇందుకోసం విస్తృతంగా తనిఖీలు చేశారు. కాలేజ్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వరంగల్‌లో ప్లాటినం జూబ్లీ వేడుకలు.. హాజరవనున్న వెంకయ్య నాయుడు
ఉప రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో సభాస్థలిని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కళాశాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 5000 మంది కూర్చునే విధంగా సభను సుందరంగా తీర్చిదిద్దారు. వేసవి దృష్ట్యా ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేశారు. కళాశాల పూర్వ విద్యార్థి అయిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరవనున్నారు.