ప్లాటినం జూబ్లీ వేడుకలకు వరంగల్ నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాల ముస్తాబవుతోంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలోని పిచ్చిమొక్కలను, చెత్తాచెదారాన్ని రెండు వందల మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు శుభ్రం చేస్తున్నారని ఎన్ఎస్ఎస్ ప్రోగాం ఆఫీసర్ గోపి తెలిపారు.
ఏవీవీ కళాశాల 75వ వార్షికోత్సవాలకు ఉపరాష్ట్రపతి - కళాశాల వార్షికోత్సవాలు
వరంగల్ నగరంలోని ఏవీవీ జూనియర్ కళాశాల ప్లాటినం జూబ్లీ వేడుకలకు ముస్తాబవుతోంది. ఈ వార్షికోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
![ఏవీవీ కళాశాల 75వ వార్షికోత్సవాలకు ఉపరాష్ట్రపతి vice president about to come in platinum jubilee celebrations of avv collage at warangal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6113725-124-6113725-1582017789375.jpg)
ఏవీవీ కళాశాల 75వ వార్షికోత్సవాలకు ఉపరాష్ట్రపతి
75 వసంతాలు పూర్తి చేసుకున్న కళాశాల వార్షికోత్సవాలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రావడం అధ్యాపకులు, విద్యార్థులకు నూతన ఉత్తేజాన్ని నింపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు వైభవంగా చేస్తున్నామని తెలిపింది.
ఏవీవీ కళాశాల 75వ వార్షికోత్సవాలకు ఉపరాష్ట్రపతి
ఇదీ చూడండి:రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ