వరంగల్ అర్బన్ జిల్లావ్యాప్తంగా గణేష్ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం అంక్షలు విధించడాన్ని నిరసిస్తూ విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ అధ్వర్యంలో ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కాశీబుగ్గ కూడలిలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం లేబర్ కాలనీ వద్ద రాస్తారోకో చేయడం వల్ల వరంగల్ – నర్సంపేట రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
గణేష్ ఉత్సవాలపై అంక్షలకు వ్యతిరేకంగా నిరసన! - వీహెచ్‌పీ
గణేష్ ఉత్సవాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా వరంగల్ అర్బన్ జిల్లావ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. హిందువుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నదని భజరగ్దళ్, వీహెచ్‌పీ నాయకులు ఆరోపించారు.

గణేష్ ఉత్సవాలపై అంక్షలకు వ్యతిరేకంగా నిరసన!
గణేష్ ఉత్సవాలపై అంక్షలకు వ్యతిరేఖంగా నిరసన!
హిందువులపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రవర్తిస్తోందని వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ నాయకులు ఆరోపణలు చేశారు. ప్రభుత్వం స్పందించి వినాయక ఉత్సవాలపై ఆంక్షలు తొలగించకపోతే.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి :విఫలమవడానికి గల కారణాలపై కమిటీ వేశాం : జెన్‌కో సీఎండీ