వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాలను తిరిగి అప్పగించే ప్రక్రియను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ రవీందర్ ప్రారంభించారు. హన్మకొండలో ధ్రువపత్రాలను సమర్పించిన వారికి వాహనాలను సీపీ అప్పగించారు. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి వరంగల్లో వేలాది వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ రవీందర్ చెప్పారు.
వరంగల్లో యజమానులకు వాహనాల అప్పగింత - వరంగల్ నగర సీపీ రవీందర్ వాహనాల అప్పగింత
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంగా సీజ్ చేసిన వాహనాలను వరంగల్లో యజమానులకు తిరిగి అప్పగించారు. వరంగల్ నగర సీపీ రవీందర్ ఈ ప్రక్రియను ప్రారంభించారు.
వరంగల్లో యజమానులకు వాహనాల అప్పగింత
డీజీపీ ఆదేశాలతో యజమానుల దగ్గర ధ్రువీకరణ పత్రాలు తీసుకొని వాహనాలను తిరిగి అప్పగిస్తున్నామన్నారు. న్యాయస్థానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు వాహనాన్ని ప్రవేశపెట్టే విధంగా... యజమానులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని సూచించారు. పట్టుబడ్డ వాహనాలను తీసుకోవడానికి పెద్దసంఖ్యలో యజమానులు స్టేషన్ వద్దకు వచ్చారు.