తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2020, 7:16 PM IST

ETV Bharat / state

వాహనాల తనిఖీలు మరింత కఠినతరం: సీపీ రవీందర్

అకారణంగా రోడ్ల మీదకి వచ్చే వాహనాలను ఇకపై సీజ్ చేస్తామని వరంగల్ సీపీ హెచ్చరించారు. లాక్ డౌన్ అమలు తీరుపై క్షేత్ర స్థాయి పోలీస్ తనిఖీ పాయింట్ నుంచి పరిశీలించారు. ఇకపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను ఆదేశించారు.

అకారణంగా రోడ్లెక్కితే వాహనాలు సీజ్ : సీపీ రవీందర్
అకారణంగా రోడ్లెక్కితే వాహనాలు సీజ్ : సీపీ రవీందర్

పోలీస్ చెకింగ్ పాయింట్లలో వాహనాల తనిఖీలు ఇంకా కఠినతరం చేయాలని వరంగల్ సీపీ రవీందర్ ఆదేశించారు. అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో అకారణంగా రోడ్ల మీదకు వచ్చే వాహనాలను కట్టడి చేయడం కోసం వరంగల్ త్రి నగరి పరిధిలోని చెకింగ్ పాయింట్లను అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసులు నిర్వహిస్తున్న వాహన తనిఖీల తీరుతెన్నులపై పోలీస్ కమిషనర్ క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు.

ఈ సందర్భంగా లాక్ డౌన్​ను అతిక్రమించి రోడ్ల మీద తిరిగే వాహనాల యాజమానులను కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా తిరుగుతున్న వాహనాలపై కేసులు నమోదు చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అలాంటి వాహనాలను సీజ్ చేస్తూ లాక్ డౌన్ అనంతరం తిరిగి అందజేయాలని పోలీసులకు సూచించారు. ఇంట్లోనే ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీ కోరారు.

ఇవీ చూడండి : ఆస్పత్రిలోకి నో ఎంట్రీ- 6 గంటలు రోడ్డుపైనే కరోనా రోగులు

ABOUT THE AUTHOR

...view details