వరంగల్ నగరంలో గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో చదువుల్లో రాణించిన విద్యార్థిని విద్యార్థులకు ఆ ట్రస్ట్ ద్వారా ఐదు వేల నగదును అందజేశారు.
గ్రామీణ విద్యార్థులకు అండగా నిలిచిన ట్రస్ట్ - telangana news today
వరంగల్ నగరంలో గ్రామీణ ప్రాంత విద్యార్థిని విద్యార్థులను వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ ప్రోత్సహించింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుల్లో రాణించిన వారికి నగదు బహుమతిని అందజేశారు.
గ్రామీణ విద్యార్థులకు అండగా నిలిచిన ట్రస్ట్
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వారికి పోటీ పరీక్ష నిర్వహించారు. అందులో ప్రతిభ కనపరిచిన 52 విద్యార్థిని విద్యార్థులకు రూ.ఐదు వేల నగదును ప్రథమ బహుమతిగా, మరో 50 మంది విద్యార్థులకు రూ.1,500 ప్రోత్సాహంగా అందజేశారు. విద్యార్థిని విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని వారు వెల్లడించారు.
ఇదీ చూడండి :ప్రేమ పేరుతో మోసం..ప్రియుడి ఇంటి ముందు ధర్నా