వరంగల్ నగర శివార్లలోని మడికొండ పారిశ్రామికవాడలో కొత్తగా ఏర్పాటైన మినీ జౌళి పార్కులో చీరలు, దుస్తులపై కావాలనుకున్న నమూనా(డిజైన్)ను తెరపైనే ఎంపిక చేసుకొని వెంటనే నేసే అవకాశం ఉంది. ఇందుకు చైనా నుంచి తెప్పించిన అత్యాధునిక జకార్డ్ పవర్ లూమ్స్(Jakard powerloom)కు ఎలక్ట్రానిక్ తెరలను అనుసంధానించారు. పెన్ డ్రైవ్‌లో కోరుకున్న రకాలు తెచ్చి ఆ తెరకు అనుసంధానిస్తే ఆయా డిజైన్లలో వస్త్రాలను నేసే అవకాశం ఉంది.
Jakard powerloom: మనసులో నమూనా.. మగ్గంపై నేసేలా.. - mini jouli park in warangal
చేనేత వస్త్రాలంటే మగ్గంపైనే నేస్తారని మనకు తెలుసు. నేత కార్మికులు వారు ముందుగా అనుకున్న డిజైన్లను ఏ ఎలక్ట్రానికి యంత్రాల సహాయం లేకుండా కేవలం మగ్గం ద్వారానే ముద్రిస్తారు. కానీ జకార్డ్ పవర్ లూమ్స్ ద్వారా కంప్యూటరీ ఎంబ్రాయిడరీ మాదిరిగా వస్త్రాలపై నమూనాలు రూపొందించవచ్చు. అదెలాగంటే..
జకార్డ్ పవర్ లూమ్
చీరలపై పక్షులు, జంతువుల బొమ్మలు, మనుషులు.. ఇలా వివిధ రూపాలను ముద్రించవచ్చు. ఇక్కడి పవర్ లూమ్స్‌లో చీరలు, షర్టింగ్‌లు, పంజాబీ డ్రెస్ మెటీరియలే కాదు.. దోమ తెరలనూ నేసే సౌలభ్యం ఉండటం విశేషం. పాత వాటితో పోలిస్తే ఈ యంత్రాలు రెట్టింపు వేగంతో పనిచేస్తున్నాయి.
ఇదీ చదవండి:Huzurabad by election : హుజూరాబాద్‌లో ఊహకందని పోరు.. ప్రచారంలో వాక్బాణాల హోరు