తెలంగాణ

telangana

ETV Bharat / state

'వరంగల్​ అభివృద్ధికి కేసీఆర్, కేటీఆర్​ విశేష కృషి' - trs campaign in hasanparthy division

వరంగల్​ మున్సిపల్ కార్పొరేషన్​ ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. హన్మకొండలో తెరాస అభ్యర్థి తరఫున వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్​ పర్యటించారు.

trs campaign in hasanaparthy
హాసనపర్తిలో తెరాస అభ్యర్థి ప్రచారం

By

Published : Apr 24, 2021, 4:23 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో గ్రేటర్ వరంగల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వివిధ పార్టీల అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హాసన్​పర్తిలో వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, తెరాస అభ్యర్థి కలిసి ప్రచారం నిర్వహించారు.

గతంలో ఎన్నడూ లేనివిధంగా నగర అభివృద్ధికి తెరాస ప్రభుత్వం కృషి చేసిందని ఎమ్మెల్యే రమేష్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వరంగల్ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఓటర్లు తెరాస కార్పొరేటర్​ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:అవార్డులతోపాటు నిధులు కూడా ఇవ్వాలి: ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details