వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం పెగడపల్లిలో బతుకమ్మ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మహిళలను ఉత్సాహపరుస్తూ.. సందడి చేశారు.
బతుకమ్మ ఆడుతూ సందడి చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ - mla aruri ramesh bathukamma celebrations news
వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. మహిళలతో కలిసి నృత్యాలు చేస్తూ హోరెత్తించారు. ప్రజలంతా సంతోషకర వాతావరణంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోవాలని సూచించారు.
బతుకమ్మ ఆడుతూ సందడి చేసిన ఎమ్మెల్యే ఆరూరి రమేశ్
ఈ సందర్భంగా ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే ఏకైక సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రజలందరూ సంతోషకర వాతావరణంలో బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకోవాలని సూచించారు.