తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు... రైతు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. రైతులను సంఘటితం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం భీమరం, మడిపల్లి, సిద్దాపూర్లో రైతు వేదిక భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.
'రైతు వేదికలతో అన్నదాతల సమస్యలకు పరిష్కారం'
తెరాస ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైతు వేదికలు... రైతు విజ్ఞాన కేంద్రాలుగా విరజిల్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.
'రైతు వేదికలు... విజ్ఞాన కేంద్రాలుగా విరజిల్లాలి'
ప్రజలను ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ భూముల్లోనే రైతు వేదిక నిర్మాణాలను చేపట్టామని ఆరూరి రమేశ్ తెలిపారు. ప్రతి రైతు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు వారి సమస్యలను చెప్పుకునేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి:'గోదారమ్మను బస్వాపూర్‌కు తెస్తాం.. సస్యశ్యామలం చేస్తాం'