ప్రకృతి అందాలను ఆస్వాదించి కొత్త ఉత్సాహాన్ని పొందడానికి అటవీ ప్రాంతాల సందర్శనకు నగరవాసులు ఆసక్తి చూపిస్తున్నారని వరంగల్ జిల్లా అటవి సంరక్షణ అధికారి ఎంజే అక్బర్ అన్నారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణి వారోత్సవాలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని ఇనుప రాతి గుట్టలో ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్బన్, రూరల్ జిల్లాల అటవీ శాఖ అధికారులు, వన్యప్రాణి ప్రేమికులు, విద్యార్థులు, నగరవాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. అర్బన్ జిల్లాలో కేవలం 1 శాతం మాత్రమే అటవీప్రాంతం ఉందని దానిని కూడా కొందరు ఆక్రమణలకు గురి చేస్తున్నారని ఎంజే అక్బర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్యప్రాణి వారోత్సవాలు - వన్యప్రాణి వారోత్సవాలు
వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వన్యప్రాణి వారోత్సవాలు జరపుతున్నారు. అందులో భాగంగానే అర్బన్ జిల్లా ముప్పారంలోని ఇనుప రాతి గుట్టలో ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వన్యప్రాణి వారోత్సవాలు