తెలంగాణ

telangana

ETV Bharat / state

vaccination: సూపర్​ స్పెడర్లకు ముమ్మరంగా వ్యాక్సినేషన్ - తెలంగాణ వార్తలు

వరంగల్​లో సూపర్ స్పెడర్లకు (super spreader) వ్యాక్సినేషన్ (vaccination) కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(minister errabelli dayakar rao) ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రోజుకు 6వేల మందికి టీకా ఇస్తామని వైద్యాధికారులు తెలిపారు.

vaccination program, minister errabelli dayakar rao
వ్యాక్సినేషన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

By

Published : May 29, 2021, 3:38 PM IST

ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సూపర్ స్పెడర్స్​ (super spreaders) కు టీకాలిచ్చే కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. కార్పొరేషన్ పరిధిలో ఈ కార్యక్రమాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు (minister errabelli dayakar rao) ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన కేంద్రాల్లో టీకాలు తీసుకోవాలని మంత్రి సూచించారు.

మొత్తం 90,500 మందిని గుర్తించగా రోజుకు 6వేల మందికి వ్యాక్సిన్లు ఇస్తున్నామని వైద్యాధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, కలెక్టర్, మేయర్ గుండు సుధారాణి, ఇతర వైద్యారోగ్య శాఖాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Lock down: ప్రజల సహకారంతో పటిష్ఠంగా లాక్​డౌన్

ABOUT THE AUTHOR

...view details