వరంగల్ అర్బన్ జిల్లాలోని పట్టణ ప్రాంత అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తుందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. స్టడీ టూర్లో భాగంగా వరంగల్ నగరాన్ని సందర్శించిన కరీంనగర్, నిజామాబాద్, సిద్ధిపేట, ఖమ్మం పట్టణాభివృద్ధి ఛైర్మన్లకు ఆయన వరంగల్ పట్టణంలోని పలు ప్రాంతాలు తిప్పి చూపించారు. కుడా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వరంగల్ పట్టణంలోని పోతన జంక్షన్, ఓ సిటీ, భద్రకాళి బండ్ తదితర ప్రాంతాలను పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లకు చూపించారు.
'కుడా' పట్టణాభివృద్ధిలో మార్గదర్శిగా నిలుస్తుంది : కుడా ఛైర్మన్
రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) మార్గదర్శిగా నిలుస్తుందని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ మర్రి యాదవ రెడ్డి అన్నారు. స్టడీ టూర్లో భాగంగా పలు నగరాల ఛైర్మన్లు వరంగల్ పట్టణాన్ని సందర్శించారు. కుడా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇతర నగరాభివృద్ధికి ప్రేరణనిచ్చేలా ఉన్నాయని కితాబిచ్చారు.
పట్టణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ఈ అధ్యయన యాత్ర మాకు ఎంతో ఉపయోగ పడనుందని పట్టణాభివృద్ధి సంస్థల ఛైర్మన్లు అన్నారు. తమ పట్టణాల్లో కూడా త్వరలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వరంగల్ పట్టణంలా.. నిజామాబాద్, కరీంనగర్, సిద్ధిపేట, ఖమ్మం పట్టణాలను తీర్చి దిద్దుతామని తెలిపారు. చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని కుడా ఛైర్మన్ మర్రి యాదవరెడ్డి అన్నారు. ఈ అధ్యయన యాత్రలో శాతవాహన పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ రామకృష్ణారావు, నిజామాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్