ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను కరోనా చిన్నాభిన్నం చేస్తోంది. కోట్లాదిమందిని పనికి దూరం చేసి రోడ్డున పడేసింది. అగ్రరాజ్యం అమెరికానే కరోనా ధాటికి కుదలైందంటే... ఇక మిగతా దేశాల గురించి చెప్పక్కరలేదు. లాక్‌డౌన్ కారణంగా చాలా మందికి పని లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమతమౌతున్నారు. ఇలాంటి సమయంలో.. ప్రభుత్వం కల్పించే ఉపాధి హామీ పనులు.. చాలామందికి వరంగా మారుతున్నాయి. గ్రామాల్లో ఉండేవారు, ఎలాంటి చదువూ లేని వాళ్లే అధికంగా ఈ పనులకు వెళ్లే వాళ్లు. కానీ గత నెల నుంచి బీటెక్, పీజీ, డిగ్రీ చేసిన విద్యావంతులూ పలుగూ పార పట్టి మట్టి పనులు చేస్తూ... అంతో ఇంతో సంపాదిస్తున్నారు.
13 వేల మంది యువకులు
వరంగల్ ఆర్బన్ జిల్లాలోనే 13 వేల మంది యువకులు.. ఈ విధంగా పనుల్లో పాల్గొంటున్నారు. ప్రైవేటు స్కూల్ ఉపాధ్యాయులూ, ఉద్యోగాలు కోల్పోయిన చిరుద్యోగులకూ ఉపాధి హామీ పనుల ద్వారా ఆదాయం లభిస్తుండంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.