వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్లోని ఒకటో నెంబర్ ప్లాట్ఫాం పక్కనగల చెట్లల్లో ఓ వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి పురుగులు పట్టి గుర్తుపట్టలేని స్థితిలో ఉంది. పక్కనే రైల్వే సిబ్బంది కార్యాలయాలు ఉన్నప్పటికీ... ఎవరూ గుర్తించకపోవడం గమనార్హం. అయితే మృతదేహం ఉన్న స్థలం రైల్వే పోలీసులు పరిధిలోకి వస్తుందని కాజీపేట సివిల్ పోలీసులు అంటుండగా.... సివిల్ పోలీసులు పరిధిలోకే వస్తుంది అని రైల్వే పోలీసులు చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా మృతదేహాన్ని అక్కడ నుంచి ఎవరు తరలించలేదు.
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి - UH UNKNOWN PERSON DIED AT RAILWAY STATION
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన వరంగల్ పట్టణ జిల్లా కాజీపేట రైల్వేస్టేషన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
![అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3194156-thumbnail-3x2-deathjpg.jpg)
అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి