కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు తప్పుడు ప్రచారం మానుకోవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రికి.. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి - Minister Kishan Reddy Speech
భద్రకాళి అమ్మవారిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దర్శించుకున్నారు. కిషన్‌రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర పాలనలో ప్రజలు మార్పుకోరుతున్నారని వెల్లడించారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కేంద్రమంత్రి అయిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలని అనుకున్నా... కరోనా తదితర కారణాల వల్ల కుదరలేదన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ చేరుకునేముందు జనగామలో కాసేపు ఆగిన కేంద్రమంత్రి తెరాసపై మండిపడ్డారు. వరంగల్ పర్యటన అనంతరం దివంగత నేత నోముల నర్సింహయ్య కుటుంబాన్ని పరామర్శిస్తామని చెప్పారు.