రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కన్వీనర్ రామకృష్ణ పేర్కొన్నారు. హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలో.. ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు.
'ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి' - Under the auspices of the Telangana Activists Forum, a joint Warangal District Telangana Activists' Spiritual Association was formed
ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
'ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి'
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. ఉద్యమకారులపై నమోదైన కేసులతో చాలామంది ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేసిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని .. వారి కోసం ప్రభుత్వం సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేసి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:కేంద్ర విద్యాశాఖ మంత్రికి వినోద్‌కుమార్ లేఖ