వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల అందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 22 రోజుల నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. సమ్మెలో భాగంగా హన్మకొండలో మహార్యాలీ నిర్వహించారు. చౌరస్తా నుంచి ఎకశిలా పార్కు వరకు ర్యాలీ చేపట్టారు. రోజుకు ఒక తీరుతో నిరసన తెలుపుతూ తమ అవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో సమ్మె అపేది లేదని హెచ్చరించారు.
వరంగల్లో ఆర్టీసీ కార్మికుల మహార్యాలీ - వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 22వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది.
వరంగల్లో ఆర్టీసీ కార్మికుల మహార్యాలీ
TAGGED:
TSRTC WORKERS STRIKE