వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమంలో భాగంగా హంటర్ రోడ్లోని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ ఇంటి ఎదుట ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చావు డప్పు కొడ్తూ... నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు చావు డప్పులతో నిరసన - వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల సమ్మె
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రం హన్మకొండలో హుస్నాబాద్ ఎమ్మెల్యే ఇంటి ముందు చావు డప్పు కొడ్తూ... ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే ఇంటి ముందు ఆర్టీసీ చావు డప్పు
ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వ మొండి వైఖరిని వీడాలంటూ నినాదాలు చేశారు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఏ మాత్రం స్పందించడం లేదన్నారు. ఎమ్మెల్యే ఇంటి ముందు ఆందోళన చేస్తున్న ఎమ్మార్పీఎస్, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి: ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో కొనసాగుతున్న విచారణ