వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల అరెస్ట్ పర్వం కొనసాగుతోంది. ఉదయం నుంచే రోడ్డు పై కనపడ్డ ఆర్టీసీ కార్మికులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ వద్ద తాత్కాలిక ఆర్టీసీ డ్రైవర్లకు, ఆర్టీసీ మహిళ కండక్టర్లు గులాబి పూలు ఇచ్చి తమ నిరసనను తెలియజేశారు. వారికి దండం పెట్టి మా పొట్టను కొట్టద్దంటూ వేడుకొన్నారు. 18 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. నిరసన తెలుపుతున్న ఆర్టీసీ మహిళ కండక్టర్లను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. ఉదయం నుంచి ఇప్పటివరకు 30 మంది ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డుపై నడుస్తూ కనిపించినా అరెస్టే...
వేకువజాము నుంచి రోడ్లపై కనిపించిన ప్రతీ ఆర్టీసీ కార్మికుడిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 30 మంది ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రోడ్డుపై నడుస్తూ కనిపించినా అరెస్టే...