ఆర్టీసీని రక్షించాలని కోరుతూ వరంగల్లో కార్మికులు నిరసన ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని వరంగల్-1 డిపో నుంచి ఎకశిలా పార్కు వరకు సాగిన ఈ ర్యాలీలో కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా... మొండి వైఖరి వీడి తమను విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు వేడుకున్నారు. 50 రోజులుగా సమ్మె చేస్తున్నామని... ఆర్టీసీ తమకు దూరం అవుతుందమేనని మహిళా కార్మికులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ జాలి చూపి సమస్యలను పరిష్కరించి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు.
సమ్మెలో కన్నీరు పెట్టుకున్న మహిళా కార్మికులు...
"ఆర్టీసీ సమ్మె 50 రోజులకు చేరుకుంది. ఇన్ని రోజులు విధులకు హాజరుకాకుండా ఉండటం చాలా బాధగా ఉంది. ఆర్టీసీ మాకు దూరమవుతుందేమోనని భయమేస్తోంది. సీఎం సారు ఇప్పటికైనా మా మీద దయతలచండి"- మహిళా కార్మికులు
TSRTC WOMEN EMPLOYEES GOT EMOTIONAL FOR THEIR JOBS