మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి పిలుపు మేరకు మంత్రి ఎర్రబెల్లి ఇంటిని ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.
హన్మకొండ రాంనగర్‌లోని ఎర్రబెల్లి నివాసం ముందు కార్మికులు నిరసన తెలిపారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. పరస్పరం తోపులాట జరిగింది. కార్మికులను అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగులు నినాదాలు చేశారు.