తెలంగాణ

telangana

ETV Bharat / state

8వరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె - TSRTC Strike latest news

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎనిమిదో రోజు కొనసాగుతుండటం వల్ల వరంగల్ అర్బన్ జిల్లాలో అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్​లతో బస్సులను నడిపిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

8వరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

By

Published : Oct 12, 2019, 1:01 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతుంది. విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో అధికారులు తాత్కాలిక డ్రైవర్, కండక్టర్​లతో బస్సులను నడిపిస్తున్నారు. దసరా పండుగను ముగించుకోని వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణికులకు ఇబ్బందులు పడకుండా అధికారులు అధిక సంఖ్యలో బస్సులు నడిపిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​కు ఎక్కువ సంఖ్యలో బస్సులను తిప్పుతున్నారు. అధిక బస్సులు తిప్పిన ఆదాయం మాత్రం రావడం లేదు. కోట్లలో నష్టం వస్తుంది. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేయటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్​లో పోలీస్​ బలగాలు అధిక సంఖ్యలో మోహరించారు.

8వరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ABOUT THE AUTHOR

...view details