ఆర్టీసీ సమ్మెతో వరంగల్ రీజియన్‌కు 2 కోట్లకు పైగా నష్టం - ఆర్టీసీ సమ్మెతో వరంగల్ రీజియన్‌కు 2 కోట్లకు పైగా నష్టం
వరంగల్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. సమ్మె కారణంతో వరంగల్ రీజియన్‌లో 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు.
ఆర్టీసీ సమ్మెతో వరంగల్ రీజియన్‌కు 2 కోట్లకు పైగా నష్టం
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో నాలుగో రోజు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. విధులు బహిష్కరించి ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉండటంతో తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా హన్మకొండ బస్టాండ్ పరిసరాలన్నీ ప్రయాణికులు లేక వెలవెలబోతున్నాయి. వరంగల్ రీజియన్‌లో ఆర్టీసీ సమ్మె వల్ల మూడు రోజుల్లో 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది.