వరంగల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె
దసరా సెలవుల అనంతరం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ఆర్టీసీ సమ్మె వల్ల ఇబ్బంది లేకుండా తాత్కాలిక సిబ్బందితో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు.
వరంగల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న సమ్మె
వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లలతో అధికారులు బస్సులు నడిపిస్తున్నారు. సెలవుల అనంతరం వివిధ ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా హన్మకొండ బస్టాండ్ నుంచి అధికారులు అధిక సంఖ్యలో బస్సులు వేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేస్తున్న కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్టాండ్లో పోలీసులు పహారా కాస్తున్నారు.