తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 13వ రోజుకు చేరుకుంది. వరంగల్లో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా వామపక్ష పార్టీల నేతలు సామూహిక దీక్షలు చేపట్టారు. 12 రోజులుగా ఆర్టీసీ కార్మికులు విధుల బహిష్కరించి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వామపక్షాల మద్దతు - వరంగల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు
వరంగల్ జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె 13వ రోజు కొనసాగుతోంది. ఈ సమ్మెకు వామపక్షాలు మద్దతు తెలిపాయి.
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వామపక్షాల మద్దతు