హన్మకొండలో ఆర్టీసీ కార్మికుల సామూహిక దీక్షలు - తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019
వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో కూనంనేని సాంబశివరావు ఆమరణ దీక్షకు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు సామూహిక దీక్షలు చేపట్టారు.
వరంగల్లో ఆర్టీసీ కార్మికుల సమ్మె
మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు దీక్షకు సంఘీభావం తెలుపుతూ వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో ఆర్టీసీ కార్మికులు సామూహిక దీక్షలు చేపట్టారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ కనీస దయ చూపడం లేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీ డిమాండ్లు నెరవేర్చాలని కోరారు.
- ఇదీ చూడండి : గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం.. విద్యార్థి మృతి