తెలంగాణ

telangana

ETV Bharat / state

'విలీనం తప్ప... మిగతా సమస్యల పరిష్కారానికి సిద్ధం' - minister errabelli dayakar rao

వరంగల్​లో ఆర్టీసీ కార్మికులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. విలీనం తప్ప... మిగతా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు.

'విలీనం తప్ప... మిగతా సమస్యల పరిష్కారానికి సిద్ధం'

By

Published : Oct 23, 2019, 5:50 PM IST

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వరంగల్‌ పట్టణ జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆర్టీసీ కార్మికులు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దీనిపై మంత్రి దయాకర్‌ సానుకూలంగా స్పందించారు. విలీనం తప్ప... మిగతా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు. వీలైనంత త్వరలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించుకోవాలని సూచించారు.

'విలీనం తప్ప... మిగతా సమస్యల పరిష్కారానికి సిద్ధం'

ABOUT THE AUTHOR

...view details