కాజీపేట సిద్దార్థనగర్కి చెందిన శౌరిరెడ్డి, సునీతా దంపతులు తూర్పుగోదావరి నుంచి ఏడు సంవత్సరాల క్రితం రుద్రాక్ష మొక్కను తీసుకువచ్చారు. తమ పండ్లతోటలో నాటారు. అప్పటి నుంచి మొక్క పెంపకంపై ప్రత్యేకశ్రద్ధను కనబరుస్తూ... పూర్తిగా సేంద్రీయ ఎరువులను అందించారు.
రుద్రాక్ష వృక్షం.. వరంగల్ వాసి అద్భుతం.. - కాజీపేట
అది ఒక చెట్టు నుంచి వచ్చే విత్తనం. హిందువులు దానిని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పూజకు ఉపయోగిస్తారు. శక్తిమంతమైనదిగా భావించి శరీరంపై ధరిస్తారు. ఈ గింజల్లో ఏకముఖం, ద్విముఖం, త్రిముఖం నుంచి 21 ముఖాలతో ఈ విత్తనం ఆకట్టుకుంటుంది.
రుద్రాక్ష వృక్షం.. వరంగల్ వాసి అద్భుతం..
ఈ సంవత్సరం చెట్టు నుంచి మొదటిసారిగా పూతకి వచ్చి కాయలు కాయడం ప్రారంభించింది. చెట్టు నుంచి వచ్చిన కాయలను ఎండబెట్టి గింజలను తీయగా సుమారు వెయ్యి వరకు రుద్రాక్షలు వచ్చాయని తెలిపారు. ద్విముఖం, త్రిముఖం నుంచి 21 ముఖాల వరకు కలిగిన రుద్రాక్షలు లభిస్తున్నాయని చెబుతున్నారు.
ఇదీ చూడండి:21 ముఖాలతో కనువిందు చేస్తున్నరుద్రాక్షలు
Last Updated : Mar 23, 2019, 4:04 PM IST